కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటికీ వాహనదారులు యథేచ్ఛగా రోడ్ల పైకి వస్తున్న పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, ప్యాట్నీ సెంటర్, జేబీఎస్ ప్రాంతాల్లో ప్రయాణికులు, వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చి సమూహాలుగా నిలబడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి రోడ్లపై కనిపిస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
వైరస్ ప్రబలుతున్న వేళ కోరి మరీ వ్యాధులను కొనితెచ్చుకోవడం సరైనది కాదని... ఎలాంటి కారణాలు లేకపోయినా ప్రజలు రోడ్లపైకి రావడం మంచిది కాదన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతున్న ప్రైవేటు వాహనాలు, 30 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదంవండి:'ఎయిర్ ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు