ETV Bharat / state

భారీగా తగ్గిన పోలింగ్.. 2019తో పోలిస్తే 15 శాతం తగ్గుదల! - తిరుపతి ఉపఎన్నిక వార్తలు

ఏపీలోని తిరుపతి లోక్​సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో.. ఓట్లు వేయటానికి ప్రజలు అనాసక్తి కనబర్చారు. శనివారం రాత్రి 7గంటల వరకు 64.29% పోలింగ్ శాతం నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76% పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి దానికంటే సుమారు 15.47 శాతం తగ్గింది. మే 2న జరిగే ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరన్నది తేలనుంది.

people-didn't-utilize-their-votes-in-tirupathi-bypolls
భారీగా తగ్గిన పోలింగ్.. 2019తో పోలిస్తే 15 శాతం తగ్గుదల!
author img

By

Published : Apr 18, 2021, 10:28 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికపై ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. శనివారం జరిగిన ఉప ఎన్నికలో రాత్రి 7 గంటలకు 64.29% పోలింగ్‌ నమోదైంది. మొత్తం 17,10,699 మంది ఓటర్లు ఉండగా 10,99,784 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందకొడిగా సాగినా మధ్యాహ్నానికి పుంజుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ రాత్రి 7 గంటల వరకు ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించినా ఓటర్లు సద్వినియోగం చేసుకోలేదు.

15 శాతం పైగా తగ్గింది..

2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76% పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి దానికంటే సుమారు 15.47 శాతం తగ్గింది. మే 2న జరిగే ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరన్నది తేలుతుంది. శనివారం పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల వరకు ఓటర్లు పెద్దగా రాలేదు. 9 గంటల వరకు 7.80% పోలింగ్‌ జరిగితే, 11 గంటల వరకు 17.30% నమోదైంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. సాధారణంగా వేసవిలో ఉదయాన్నే ఓట్లు వేస్తారు. కానీ ఉప పోరులో అలా కనిపించలేదు. ఉదయం 11 గంటల తర్వాతే ఓటింగ్‌ శాతం క్రమేపీ పెరుగుతూ వచ్చింది.

ఆఖరు రెండు గంటల్లో..

మధ్యాహ్నం 1 గంటకు 36.67%కు చేరుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో 54.99% ఉండగా ఆఖరి రెండు గంటల్లోనే సుమారు 9 శాతం పెరిగి చివరికి 64.29% మేరకు ఓటింగ్‌ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. సత్యవేడు నియోజకవర్గంలో అత్యధికంగా 72.68 శాతం.. తిరుపతిలో అత్యల్పంగా 50.58 శాతం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 65.94% పోలింగ్‌ నమోదుకాగా.. ఇటీవలి కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ అక్కడ సుమారు 56% ఓటింగ్‌ జరిగింది. ఇప్పుడు అంతకన్నా తక్కువ నమోదు కావడం గమనార్హం.

కారణాలు ఇవీ..

2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో 77.14 శాతం పోలింగ్‌ నమోదైంది. నాడు మొత్తం 15,74,161 మంది ఓటర్లుండగా 12,14,363 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 16,50,453 మందికి 13,16,473 మంది.. అంటే 79.76% మంది ఓట్లు వేశారు. ఇప్పుడు 64.29 శాతమే పోలింగ్‌ జరిగింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్థానికసంస్థల ఎన్నికల సమయంలో విపక్ష నేతలు నామినేషన్‌ దాఖలు చేయలేకపోయారు. విపక్ష కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారన్న విమర్శలు వినిపించాయి. అప్పటి నుంచి ఇతర పార్టీలవారు బయటకు వచ్చేందుకు సంకోచించారు. ఇతరులకు ఓటు వేస్తే తమకు అందాల్సిన లబ్ధి చేకూరదన్న ఉద్దేశంతో పలువురు వెనుకడుగు వేసినట్లు చెబుతున్నారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలతో స్థానిక ఓటర్లు భయానికి గురయ్యారని చెబుతున్నారు.

12 మంది దొంగ ఓటర్లపై కేసు

తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలు పార్టీల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేశారు. రెండు బస్సులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రశాంతంగా పోలింగ్‌: సీఈఓ

తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో సుమారు 64.29% పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కె.విజయానంద్‌ వెల్లడించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ ముగిసే సమయం రాత్రి 7 గంటల వరకూ వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినందున తుది పోలింగ్‌కు సంబంధించి రిటర్నింగ్‌ అధికారుల నుంచి పూర్తి నివేదిక అందాల్సి ఉందని వివరించారు.

'దొంగ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు'

నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ ఆదేశించారు. నకిలీ ఓట్లు పోలవుతున్నాయంటూ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులతో శనివారం ఆయన మాట్లాడారు.

250 వాహనాల్ని తిప్పి పంపాం: డీజీపీ

తిరుపతి ఉప ఎన్నికల్లో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అందులో భాగంగా సుమారు 250 వాహనాల్ని తిప్పి పంపించామని చెప్పారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలూ తీసుకున్నామని అన్నారు.

ఇదీ చదవండి: తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల దందా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.