లాక్‌డౌన్ కారణంగా జంట నగరాల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని రోడ్లన్నీ జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. రహదారులపై జనాలు, వాహనాల రద్దీ లేకపోవడం వల్ల... అడవుల్లో ఉండే మయూరాలు రోడ్లపైకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ జాతీయ ఉద్యానవనం వద్ద మయూరాలు స్వేచ్ఛగా బయట విహరిస్తున్నాయి. పార్క్ అవతలకు వచ్చి రోడ్లపై అటు ఇటు తిరుగుతూ... ఆనందంగా పురివిప్పి నాట్యమాడాయి. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని కనువిందు చేశాయి.
ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్... రూపొందించిన డీఆర్డీవో