ETV Bharat / state

'యూనివర్సిటీలకు వీసీలుగా ప్రొఫెసర్లనే నియమించాలి'

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీలుగా ప్రొఫెసర్లనే నియమించాలంటూ పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీలుగా ఐఏఎస్​ ఆఫీసర్లను నియమించడంపై విద్యార్థినేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు.

PDSU
author img

By

Published : Jul 27, 2019, 2:05 PM IST

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీలుగా ప్రొఫెసర్లనే నియమించాలంటూ పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. వీసీలుగా ఐఏఎస్​ ఆఫీసర్లను నియమించడాన్ని నిరసిస్తూ...ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే డిగ్రీ కళాశాలలోని పీజీ కోర్సులను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందరికి అందించాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని శ్రీనివాస్​ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

'యూనివర్సిటీలకు వీసీలుగా ప్రొఫెసర్లనే నియమించాలి'

ఇవీ చూడండి:రాజ్​భవన్​ రోడ్డు కృష్ణా పైపులైన్​లో లీకేజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.