రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నందునే.. రోజురోజుకూ మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గవర్నర్ తమిళిసైకి వివరించారు. రాజ్భవన్లో నేడు గవర్నర్ను కలిసిన ఆమె.. రాష్ట్రంలో యువతులపై, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో సుమారు 17,952 బెల్ట్ షాపులు ఉన్నట్లు ఆర్టీఐ కింద సమాచారం వచ్చినట్లు ఆమె వివరించారు. ప్రభుత్వం కేవలం ఆదాయం కోసమే వాటిని ప్రోత్సహిస్తూ.. ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. తక్షణమే మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి, బెల్టుషాపులను రద్దు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ