ETV Bharat / state

కేసీఆర్​ మాటలకు... క్షేత్రస్థాయిలో అమలుకు పొంతన లేదు: ఉత్తమ్​

లాక్​డౌన్​ సందర్భంగా ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, ఆర్థిక సాయం అందరికీ అందేలా చూడాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు.

pcc president uttam press meet
కేసీఆర్​ మాటలకు... క్షేత్రస్థాయిలో అమలుకు పొంతన లేదు: ఉత్తమ్​
author img

By

Published : Apr 13, 2020, 4:06 PM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రారంభమై 22 రోజులు గడిచినప్పటికీ రేషన్‌కార్డుదారులకు ఇంకా 1500 రూపాయల సాయం అందలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో అమలుకు పొంతనలేదని విమర్శించారు. వలసకూలీల కోసం 200 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా.. ఎక్కడా కనిపించడంలేదని ఆరోపించారు. మార్చిలో ఒక వారం ఆదాయం కోల్పోతే... రాష్ట్ర ఖజానా వట్టిపోయిందా అని ప్రశ్నించారు.

ఉపాధి హామీ పనులు జరగడంలేదని... వెంటనే క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌తో ప్రపంచమంతా అల్లాడిపోతుంటే... కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.22వేల కోట్ల టెండర్‌ పిలవడం దారుణమని ఉత్తమ్‌ దుయ్యబట్టారు.

కేసీఆర్​ మాటలకు... క్షేత్రస్థాయిలో అమలుకు పొంతన లేదు: ఉత్తమ్​

ఇవీ చూడండి: వైరస్​పై సీసీఎంబీ బహుముఖ యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.