కాంగ్రెస్ తరఫున కూడా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారతరత్న ఇవ్వాలని 2013లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద పైవంతెనకు పీవీ ఎక్స్‌ప్రెస్‌వేగా నామకరణం చేశామని చెప్పారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉత్తమ్ ఆరోపించారు. 4 కోట్ల మంది ప్రజలకు ఒక్క కొవిడ్ ఆస్పత్రి మాత్రమే ఉందని చెప్పారు. కరోనా పరీక్షలు పెంచాలని గవర్నర్‌ను కలిసి విన్నవించామని తెలిపారు. కరోనా మరణాలకు ఇతర కారణాలు చూపుతున్నారని విమర్శించారు. కొవిడ్‌తో చనిపోయిన పేదలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన పోలీసులు, విలేకరుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.
29న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు
పెట్రోల్, డిజీల్ ధరల పెంపునకు నిరసనగా ఈనెల 29న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన చేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ జులై 3న నిరసన చేపడతామని ప్రకటించారు. బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి.. ఇళ్లు, వాహనాలపై నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని చెప్పారు.
ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్