ETV Bharat / state

తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటే.. : ఉత్తమ్​

author img

By

Published : Nov 29, 2020, 9:59 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాతబస్తీపై సర్జికల్​ స్ట్రైక్​ చేస్తామని బండి సంజయ్ అనడం సరికాదని ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్​ ఒక్కటే సెక్యులర్​ పార్టీ అని పేర్కొన్నారు.

PCC Chief Uttam Kumar Campaign at Buddhanagar Hyderabad

హైదరాబాద్​ పాతబస్తీపై సర్జికల్​ స్ట్రైక్​ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వ్యాఖ్యలు చేయడం సరికాదని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్​తో కలిసి సికింద్రాబాద్​ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

బౌద్ధనగర్​లో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తోన్న బౌద్ధ నగర్​, సీతాఫల్​మండి, తార్నాక, మెట్టుగూడ డివిజన్లకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటేనని మతపరమైన రాజకీయాలు చేస్తూ.. ఆయా పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు.

కాంగ్రెస్​ అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుందని.. సెక్యులర్​ పార్టీగా ప్రజల మన్ననలు పొందిందని గుర్తు చేశారు. కాంగ్రెస్​ గెలిస్తే.. వరద బాధితులకు 50వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా గ్రేటర్​ హైదరాబాద్​కు చేసిందేమి లేదని... గతంలో కాంగ్రెస్​ చేసిన అభివృద్ధి మాత్రమే ఉందన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలిచి.. మేయర్​ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్​కు పట్టం కట్టాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.