ETV Bharat / state

మోదీ కరోనా డ్రామా... కేసీఆర్ సభ అట్టర్​ ఫ్లాప్: ఉత్తమ్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020

భాజపా, తెరాసలపై తీవ్ర విమర్శలు చేశారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. హైదరాబాద్​ గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడిన ఆయన... హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని.. మున్ముందు కూడా చేసి చూపుతామన్నారు.

మోదీ కరోనా డ్రామా... కేసీఆర్ సభ అట్టర్​ ఫ్లాప్: ఉత్తమ్

author img

By

Published : Nov 29, 2020, 2:39 PM IST

ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ పేరుతో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. మోదీ రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​ గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడిన ఆయన... భాజపా నాయకుల ప్రవర్తన హైదరాబాద్ వాసులను అవమానపరిచేలా ఉందన్నారు. వరదలు వచ్చినప్పుడు హోంమంత్రిగా పరామర్శ చేయని అమిత్​షా... మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తారా అని ప్రశ్నించారు.

మోదీ కరోనా డ్రామా... కేసీఆర్ సభ అట్టర్​ ఫ్లాప్: ఉత్తమ్

యూపీ సీఎం యోగి ఆయన రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామంటారు. మీరు ఎవరు ఆ మాట అనడానికి? కేంద్రం... హైదరాబాద్​కు ఏం చేసింది. గ్రేటర్ అభివృద్ధి జరిగిందంతా కాంగ్రెస్ హయాంలోనే. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? కేసీఆర్ సభ అట్టర్​ఫ్లాప్ అయింది.

--- మీడియాతో పీసీసీ చీఫ్ ఉత్తమ్

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ఏడేళ్లపాటు దోచుకున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. తెరాస సభలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లడలేదన్నారు. తెరాస పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని.. మున్ముందు కూడా చేసి చూపుతామని ఉత్తమ్​ అన్నారు. కాంగ్రెస్​కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అమిత్​ షా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.