Revanth reddy fires on CM KCR : కాంగ్రెస్ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న రేవంత్... ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఎంపీ కార్యాలయంలో కంది శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో ఆదిలాబాద్, షాద్‌నగర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Revanthreddy Latest Comments : ఆదిలాబాద్‌కు బీఆర్‌ఎస్ చేసిందేమి లేదన్న రేవంత్‌రెడ్డి... జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు 5లక్షల సాయంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా రైతులకు 2లక్షల రుణమాఫీ, 500రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామన్నారు.
'ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారందరికీ సాదర స్వాగతం. ఆదిలాబాద్‌కు బీఆర్‌ఎస్ చేసిందేం లేదు. జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుంటుంది. మీ జిల్లాలో గృహనిర్మాణశాఖ మంత్రి ఉన్నారు. మంత్రి ఉన్నా ఆదిలాబాద్ ప్రజలకు ఇల్లు రాలేదు. అధికారంలోకి రాగానే పేదలు ఇల్లు కట్టుకునేందకు రూ.5లక్షలు, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. అలాగే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ఆదిలాబాద్‌లో 8 అసెంబ్లీ స్థానాల్లో మీరు కాంగ్రెస్‌ను గెలిపించండి. రాష్ట్రంలో 80 అసెంబ్లీ స్థానాలు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే పిల్లలకు ఉద్యోగాలు : సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేస్తోందన్న ఆయన... రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తున్న హామీలు అన్నీ అమలు చేస్తామని మాటిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు జన్మదిన కానుక ఇద్దామని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదన్నారు. జోగు రామన్న చెల్లని రూపాయని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న రేవంత్... అందుకే ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వవలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. మరోసారి సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి :