Revanth reddy on KCR అందమైన రాచకొండ భూములపై కేసీఆర్ కన్నుపడిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాచకొండ భూముల నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అందమైన రాచకొండ భూములను సినిమా పెద్దలకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని అభిప్రాయపడ్డారు. తెరాస, భాజపా కలిసి ప్రజలను తాగుడుకు బానిసలు చేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో ఉంచి సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో, దేశంలో అధికార పార్టీలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ స్పష్టం చేశారు. ఇద్దరికి శత్రువు అయిన కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, భాజపా కలిసి ద్రోహులను కొని కుట్ర చేస్తున్నాయని వెల్లడించారు.
''ఈ ఎన్నికల్లో మద్యం పోయకుండా ఓట్లు అడుగుదామని పాల్వయి స్రవంతి సవాల్ విసిరారు. కానీ వాళ్లు మాత్రం మద్యం ద్వారా, డబ్బుల పంపిణీ ద్వారా గెలవాలి అని చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో తెరాసకు ప్రతిపక్షం కాంగ్రెస్, జాతీయ స్థాయిలో భాజపాకు కాంగ్రెస్ యే ప్రతిపక్షం... అందుకే ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు. అయినా మనం పోరాడుదాం... ఈనెల 30కు రాహుల్ యాత్ర షాద్ నగర్‌కు రాబోతుంది. కాంగ్రెస్ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపును ఇస్తున్నా... రాహుల్ యాత్రలో భాగస్వాములవ్వాలి. నవంబర్ 1న చివరి రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా మునుగోడు మండలంలో మహిళా గర్జన కార్యక్రమం ఉంటుంది. అక్కడికి కూడా అందరూ రావాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా...'' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి: