ETV Bharat / state

Revanth Reddy: 'ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాస్తున్నారు' - రేవంత్​ రెడ్డి వార్తలు

రెండున్నర కోట్ల ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాస్తుంటే.. సీఎం కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్​కు చెందిన అన్ని విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు.

Revanth reddy
రేవంత్​ రెడ్డి, కృష్ణా నది
author img

By

Published : Jul 1, 2021, 8:28 PM IST

కృష్ణా జలాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) అనుసరిస్తున్న వైఖరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జలజగడం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గురువారం ఎస్సార్​నగర్‌లో పీసీసీ ఉపాధ్యక్షులు సురేష్‌షెట్కర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఎలా వంచనకు గురైందో వివరించినట్లు పేర్కొన్న రేవంత్‌... ఈనెల 7 తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పాల్గొన్నారు.

మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిలపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్‌లోకి నీరు తీసుకుపోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా సుస్పష్టంగా వెల్లడించినా తెరాస ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తర్వాత జగన్మోహన్‌ రెడ్డి ప్రగతి భవన్‌ వచ్చి కేసీఆర్‌తో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకున్నాకే జీవో ఇచ్చారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి దొంగచాటుగా పని చేయడం లేదన్న రేవంత్‌ రెడ్డి ఎప్పుడు ఓట్లు కావాలన్నా.. నీళ్లను బూచిగా చూపిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల ద్వారా రోజుకు ఒక టీఎంసీకి మించి తీసుకోలేమని... అలాంటిది ఏపీ సీఎం జగన్ రోజుకు 11 టీఎంసీలు కృష్ణా నీటిని తరలించేలా ప్రణాళికలు చేస్తున్నారని విమర్శించారు. నీటి విషయంలో కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత తీసుకొచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. రెండున్నర కోట్ల ప్రజల జీవితాల మీద మరణశాసనం రాస్తుంటే.. సీఎం కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జులై 8న వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి కూతురు రాజకీయ పార్టీ పెడుతుందని, ఆ పార్టీకి ప్రయోజనం చేకూరేందుకు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఇక్కడ మంత్రులు తిడుతూ రెండు ప్రాంతాల మధ్య వైష్యమ్యాలు పెంచుతున్నారని మండిపడ్డారు. నీళ్ల దోపిడీలో రాజశేఖర్​ రెడ్డి పాత్ర లేదని.. ఆయన కుమారుడు జగన్ హస్తం ఉందని ధ్వజమెత్తారు. షర్మిళ తనపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న ఆయన భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: Drugs Case: సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసును విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.