రాష్ట్రంలో వరిధాన్యం ఆఖరి గింజ కొనేదాకా రైతుల పక్షాన కొట్లాడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy Comments) స్పష్టం చేశారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని... అవసరమైతే దిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్ల కొనుగోలులో నాటకాలాడుతున్నాయని విమర్శించిన రేవంత్... కేసీఆర్ (KCR) రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్రం ధాన్యం సేకరించడం లేదని మండిపడ్డారు. రైతులు కల్లాల్లోనే కన్నుమూస్తుంటే భాజపా నేతలు రాజకీయాలు మాట్లాడటం వారి దివాలా కోరుతనంగా అంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: Revanth in Vari Deeksha: 'వరి కొనకపోతే.. నడిబజార్ల ఉరి తీయటం ఖాయం'