ఓట్లు చీలనివ్వొద్దని బీసీ కులాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విభజించి పాలించడంలో ఈ నాయకులు బ్రిటీష్ వాళ్లను మించిపోయారని అన్నారు. కులభావనతోనైనా ఐక్యంగా ఎదగాలని పిలుపునిచ్చారు. తూర్పు కాపులతో సమావేశం నిర్వహించిన పవన్.. బీసీల హక్కుల కోసం ఉద్యమించే వారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టి కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. కుల ప్రయోజనాలు కాపాడే నేతలకు అధికారం ఇవ్వాలని పవన్ కోరారు. సమస్యలపై జనసేన పోరాడుతోందన్న ఆయన.. పార్టీకి అండగా ఉండాలని కోరారు.
ఇవీ చదవండి: