ETV Bharat / state

PAWAN KALYAN: 'గుంతలు పూడిస్తే కేసులా... ఈ దుస్థితి ఏపీలోనే ఉంది' - అధ్వానంగా ఏపీ రోడ్లు

ఆంధ్రప్రదేశ్​లో దెబ్బ తిన్న ప్రతి రోడ్డూ.. బాగుపడే వరకూ జనసేన గళమెత్తుతుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్​ స్పష్టం చేశారు. ''రహదారుల అధ్వాన్న స్థితిని చూసి గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారు... ప్రజలకు మంచి చేసినా కేసులు పెట్టడమేంటి'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

PAWAN KALYAN
పవన్‌ కల్యాణ్
author img

By

Published : Sep 9, 2021, 2:10 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేయడానికి ముందుకు వచ్చి గుంతలు పూడుస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రూ.5వేల కోట్ల రహదారి నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించిందంటూ ఆరోపించారు.

రోడ్లపై గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారని... ఈ దుస్థితి ఏపీలోనే ఉందని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంచి చేయట్లేదు సరికదా... చేసే వాళ్లను కూడా చేయనివ్వట్లేదని పేర్కొన్నారు. అడుగుకో గుంత... గజానికో గొయ్యిలా ఉన్న రాష్ట్ర రహదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు.

  • అమ్మా పెట్టదు , అడుక్కు తిననివ్వదు
    ———————————————
    రోడ్లపై గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏపీలోనే ఉంది.- Road Doctor ‘ Dr.Kaatnam Balagangadhar thilak’

    రూ.5వేల కోట్ల రహదారి నిధుల మళ్లింపు - https://t.co/ze5gsZRGTF

    — Pawan Kalyan (@PawanKalyan) September 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: జనసేన రోడ్ల ఉద్యమానికి విస్తృత స్పందన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.