Janasena Membership Registration: ఈ నెల 10న ప్రారంభం కానున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గత రెండు విడతల్లో సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన 6,400 మంది వాలంటీర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే ఉత్సాహంతో ఈ నెల 10న మొదలై 28 వరకు జరిగే మూడో విడత సభ్యత్వ నమోదును కూడా జయప్రదం చేయాలని కోరారు. పార్టీ సభ్యుల ప్రమాద బీమా నిమిత్తం పవన్ కల్యాణ్ గతంలో రూ.2 కోట్లు విరాళమిచ్చారు. ఈసారి కూడా తన విరాళాన్ని 10వ తేదీన ప్రకటిస్తానన్నారు.
"జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుకానుంది. 2021, 2022 సభ్యత్వ నమోదు చాలా విజయవంతంగా కొనసాగింది. 2023లో సభ్యత్వ నమోదు కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని జనసేన నాయకులను, వీర మహిళలను, జన సైనికులను ప్రత్యేకంగా కోరుతున్నాను. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ వాలంటీర్ల పాత్ర మరువలేనిది. 6,400 పైచిలుకు వాలంటీర్లు అమోఘమైన కృషి చేశారు. వారందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను". - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
ఇవీ చదవండి:
రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర ములుగు జిల్లా నుంచే ప్రారంభం కానుంది
మూడు పాత్రల్లో అదరగొట్టిన కల్యాణ్‌రామ్.. 'అమిగోస్' ట్రైలర్ విడుదల