హైదరాబాద్ తార్నాకలోని పద్మావతి ఆసుపత్రిలో గురువారం ఓ వ్యక్తి వైద్య చికిత్సల కోసం వచ్చి గుండెపోటుతో మరణించాడు. రామంతపూర్‌కు చెందిన గణేష్(38) ఛాతి నొప్పిగా ఉందని స్థానిక డాక్టర్ని సంప్రందించగా... వెంటనే తార్నాకలోని పద్మావతి ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. అక్కడకు వెళ్లిన గణేష్‌ను ఈసీజీ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈసీజీ పూర్తై చికిత్సకు సిద్ధమవుతున్న తరుణంలో రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలాడు. అనంతరం వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధరించారు. ఆసుపత్రికి ఒక్కడే వచ్చాడని తెలుసుకున్న సిబ్బంది సంబంధీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. గణేష్‌కు ముగ్గురు సంతానం ఉండగా... ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
ఇవీ చూడండి : శంషాబాద్ విమానాశ్రయంలో రూ.1.66 కోట్ల విలువైన బంగారం పట్టివేత