ETV Bharat / state

రోజుకు లక్ష మంది.. మెట్రోకు పెరుగుతున్న రద్దీ - hyderabad Latest News

కరోనా భయం వల్ల ప్రారంభంలో మెట్రో ఎక్కడానికి భయపడ్డ జనాలు.. ఇప్పుడిప్పుడే మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. అన్​లాక్​లో భాగంగా పలు కార్యాలయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతుండటం వల్ల.. మెట్రోకు క్రమంగా రద్దీ పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు లక్ష మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

Passengers Increasing In Hyderabad Metro Rail
రోజుకు లక్ష మంది.. మెట్రోకు పెరుగుతున్న రద్దీ
author img

By

Published : Oct 10, 2020, 4:48 PM IST

హైదరాబాద్​లో మళ్లీ ఎప్పట్లాగే ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. లాక్​డౌన్, కరోనా సమయంలో మార్చి నుంచి జులై వరకు రోడ్లన్నీ ఖాళీగా ఉండటం వల్ల జంట నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల్లో గమ్యస్థానానికి చేరేవారు. మెల్లమెల్లగా లాక్​డౌన్​ ఎత్తేయడం.. కరోనా పట్ల అవగాహన రావడం, భయాలు తొలగడం వల్ల రోడ్ల మీద ట్రాఫిక్​ పెరిగింది. ఉదయం, సాయంత్రం రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ​తో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో నగరంలో చిన్నా చితక పనులు చేసుకుంటూ ఉపాధి పొందేవారు పనులు దొరక్క కొందరు... ఉద్యోగాలు కోల్పోయి కొందరు సొంత గ్రామాలకు వెళ్లారు. అయితే కేంద్రం అన్​లాక్​లో భాగంగా వరుసగా ప్రతినెల విడతల వారిగా అనుమతులు ఇస్తుండటం వల్ల జనాలు క్రమక్రమంగా రోడ్లపైకి వస్తున్నారు. క్రమంగా పరిస్థితి మునుపటిలా మారింది. ఈ క్రమంలోనే మెట్రో సేవలు కూడా తిరిగి ప్రారంభించారు. ప్రారంభంలో మెట్రో ఎక్కడానికి భయపడ్డారు. కానీ.. ట్రాఫిక్​ సమస్య, మెట్రోలో కొవిడ్​ నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం వల్ల జనాల తాకిడి మెల్లమెల్లగా పెరుగుతోంది.

రోజుకు లక్ష మంది.. మెట్రోకు పెరుగుతున్న రద్దీ

ఛార్జీలు ఎక్కువైనా.. మెట్రోనే సేఫ్​

సుమారు 6 నెలల తర్వాత కేంద్రం ఇచ్చిన అన్​లాక్ 4.0 మార్గదర్శకాలు అనుసరించి హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. మొదట మూడు కారిడార్లలో దశల వారిగా ప్రారంభించి.. తర్వాత అన్ని కారిడార్లలో ప్రయాణికులకు మెట్రో ప్రయాణం అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో కొద్దిరోజులు మూడు కారిడార్లలో కలిపి కేవలం 30వేల మంది వరకు మాత్రమే ప్రయాణించారు. ఆ తర్వాత క్రమేణా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు దాదాపు లక్షమంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం ఈ సంఖ్య తగ్గుతోంది. మెట్రో స్టేషన్​కు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులోకి రావడం వల్ల క్రమంగా మెట్రోకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. బస్​ఛార్జీలతో పోల్చితే మెట్రో ఛార్జీలు ఎక్కువే. అయినా... మెట్రో ఎక్కేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. మెట్రో స్టేషన్​లలో కాంటాక్ట్ లెస్ టికెంటింగ్, కరోనా నిబంధనలు పాటించడం వల్ల మెట్రో ప్రయాణమే సేఫ్​గా ఉందంటున్నారు ప్రయాణికులు.

పూర్వవైభవం త్వరలోనే..

కరోనా నేపథ్యంలో నగరంలో పలు కంటైన్మెంట్ జోన్​ల పరిధిలోని మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, యూసుఫ్ గూడ, మూసాపేట్ మెట్రో స్టేషన్లలో రైలు ఆపడం లేదు. అయితే ఇటీవల మూసాపేట్ మెట్రో స్టేషన్​ను తిరిగి ప్రారంభించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న నేపథ్యంలో కొన్ని స్టేషన్లు మాత్రం ఇంకా మూసే ఉంచారు. కరోనాకు ముందు మెట్రోలో రోజుకు దాదాపు 4 లక్షలమంది ప్రయాణించే వారు. మెట్రోను ఎక్కువ ఉపయోగించే.. సాఫ్ట్​వేర్ ఉద్యోగులు.. అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు, థియేటర్స్​ తెరిస్తే.. ఎప్పట్లాగే మెట్రో పూర్వ వైభవం సంతరించుకోనుంది.

ఇదీ చదవండి: నేడు కేబినెట్ భేటీ.. చట్ట సవరణ ముసాయిదా బిల్లులపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.