ETV Bharat / state

Bandi Sanjay: బండి సంజయ్​కు పార్టీనేతల స్వాగతం.. ఉపఎన్నికపై చర్చ - బండి సంజయ్​ ప్రసంగం

యాత్ర పూర్తి చేసుకుని తొలిసారిగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్​కు (Bandi Sanjay) పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన... హుజూరాబాద్​ ఉపఎన్నికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

bandi-sanjay
Bandi Sanjay: బండి సంజయ్​కు పార్టీనేతల స్వాగతం.. ఉపఎన్నికపై చర్చ
author img

By

Published : Oct 4, 2021, 1:59 PM IST

Updated : Oct 4, 2021, 3:18 PM IST

మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసుకుని తొలిసారిగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు (Bandi Sanjay) పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో, బాణాసంచా కాల్చి.. సంతోషం వ్యక్తం చేశారు.భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్​ (Bandi Sanjay) పాల్గొన్నారు. మొదటివిడత పాదయాత్ర, హుజూరాబాద్​ ఉపఎన్నికకు సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించారు.

అనంతరం ఎల్బీనగర్​లోని శుభం గార్డెన్​లో 'వెన్నంటే ఉండి కొండంత బలాన్నిచ్చిన అంకితభావానికి ఆత్మీయ సత్కారం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజపా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి దశ... విజయవంతంగా పూర్తయిన సందర్భంగా యాత్రలో పూర్తి సమయం కేటాయించిన వారందరిని సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో వివిధ విభాగాలలో పాల్గొని పనిచేసిన వారందరిని సన్మానించి... వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ పనిచేసి 2023లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

బండి సంజయ్​ (Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) తొలివిడత శనివారం ముగిసింది. ఆగస్టు 28న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమై 36 రోజుల పాటు 438 కి.మీ. మేర సాగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ (Husnabad Bjp Meeting)లో నిర్వహించిన ముగింపుసభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smiriti Irani) హాజరయ్యారు.

ఇదీ చదవండి : Telugu akademi scam 2021 : 'ఫిబ్రవరిలోనే ఎఫ్​డీలు కాజేసేందుకు యత్నం!'

Last Updated : Oct 4, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.