ETV Bharat / state

Munugode Bypoll: ఓటర్లకు విమాన టిక్కెట్లు... నేతల వసతికి లక్షల్లో ఖర్చు!! - Munugode Bypoll

ఓ ప్రధాన పార్టీ 5 లక్షల కండువాలను తెప్పించింది. పోలింగ్‌కు 20 రోజుల ముందే అవన్నీ అయిపోయాయి. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 2.27 లక్షల మంది ఉండగా.. 5 లక్షల కండువాలు అయిపోవడం విడ్డూరం.

Munugode Bypoll
Munugode Bypoll
author img

By

Published : Oct 10, 2022, 7:03 AM IST

మునుగోడు ఉప ఎన్నిక బరిలో ప్రచారంతోపాటు బేరసారాలు హోరెత్తుతున్నాయి. సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఛోటామోటా నాయకుల ‘కొనుగోళ్లు’ యథేచ్ఛగా సాగుతున్నాయి. నాయకుల హోదాను బట్టి ప్రధాన పార్టీలు ధర నిర్ణయించి వారికి కొన్ని ‘బాధ్యతలు’ అప్పగిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులను, ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా దక్కించుకోవచ్చని పార్టీల ఆలోచన. రెండు ప్రధాన పార్టీల నాయకులు.. మరో ప్రధాన పార్టీ శ్రేణులపైనే గురి పెట్టడం గమనార్హం.

పార్టీ కండువా కప్పుకొంటే రూ. వెయ్యి, రెండు వేలు ఇస్తుండగా.. ఆదివారం ఒక నాయకుడు తన సొంత సొమ్ముతో దాన్ని మరింత పెంచేసినట్లు సమాచారం. తమ పార్టీలో చేరే యువకునికి రూ.10 వేలు, ఇంకో నలుగురిని తీసుకొస్తే మరో రూ. 50 వేలు నజరానాగా ఆయన పంచినట్లు తెలిసింది. పోటాపోటీ స్థితిని అదనుగా తీసుకుని.. కొందరు ఛోటా నాయకులు అటూ ఇటూ మారుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పార్టీ కండువా కప్పుకొని.. మారితే ఇంకా ఎక్కువిస్తారా అని అవతలి పార్టీతో బేరమాడుతున్నారు.

ఉదాహరణకు చౌటుప్పల్‌ మండలంలో ఆదివారం పలువురు యువకులు ఓ పార్టీలో చేరారు. అందుకుగాను వారికి ఉదయమే కానుకలు దక్కాయి. వారిలో రూ. 10 వేలు తీసుకున్న యువకుడు మధ్యాహ్నానికి అవతలి పార్టీలో చేరిపోయాడు. అక్కడ అంతకు రెట్టింపు ముట్టజెప్పినట్టు తెలిసింది. దీంతో అతడిని మళ్లీ వెనక్కి తీసుకురావాలని మొదటి పార్టీ వారు ప్రయత్నిస్తున్నారు.

ఓటు కొద్దీ నోటు.. వార్డు సభ్యులు, ఉపసర్పంచుల వంటి వారి చేతుల్లో 50, 100 ఓట్లుంటే చాలు.. రూ. 50 వేలకు పైగా నగదు ముట్టజెబుతున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన వారికి నచ్చజెప్పి.. నజరానాలిచ్చి వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఓ పార్టీ పోలింగ్‌బూత్‌కు, మరో పార్టీ ఎంపీటీసీ స్థానానికి ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అగ్రనాయకులను నియమించాయి. వారు తమ పార్టీ పెద్దల మెప్పు పొందేందుకు.. తమ సొంత సొమ్ముతో నజరానాలకు తెరతీస్తున్నట్లు సమాచారం.

  • చౌటుప్పల్‌ మండలంలోని ఓ గ్రామంలో ప్రధాన పార్టీకి చెందిన సర్పంచి ఆ గ్రామ ఇన్‌ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే సమక్షంలో ఇటీవలే పార్టీ మారారు. అందుకోసం ఎమ్మెల్యే అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. పార్టీ మారినందుకు రూ.15 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం.
  • వారం రోజుల కిందట ఓ ప్రధాన పార్టీ ఎంపీటీసీ సభ్యుడిని పార్టీ మార్చేందుకు ఓ ఎమ్మెల్యే తెల్లవారుజాము నాలుగు గంటలకే ఆయన ఇంటికి వెళ్లి బేరాలాడారని, ‘తగిన’ నజరానా ఇచ్చారని తెలిసింది.
  • పార్టీలు మారే క్రమంలో కోవర్టుల బెడద ఎక్కువైందని నాయకులు వాపోతున్నారు. పార్టీలో చేరినట్లే చేరి.. ఇక్కడ జరిగే వ్యూహప్రతివ్యూహాలు, రహస్యాలను ప్రత్యర్థి పార్టీలకు చేరవేసేవారితో తలనొప్పిగా మారిందని ఓ పార్టీ ముఖ్య నాయకుడు తెలిపారు.

రూ.1.56 లక్షలతో విమాన టికెట్లు చండూరు మండలంలోని ఓ గ్రామంలో 26 మంది ఓటర్లు ముంబయికి వలస వెళ్లారు. ఓటేసేందుకు వారిని నవంబరు 1నే రప్పించేలా ఓ ప్రధాన పార్టీ ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున రూ. 1.56 లక్షలు వెచ్చించి.. హైదరాబాద్‌ వరకు విమాన టికెట్లు బుక్‌ చేసింది. అక్కడి నుంచి సొంతూరికి రావడానికి బస్సు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ అనంతరం వారు ముంబయికి వెళ్లడానికి రైలు టికెట్లు బుక్‌ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఓటర్లలో చాలామంది గుజరాత్‌లోని సూరత్‌, మహారాష్ట్రలోని ముంబయి, భివండి, సోలాపూర్‌, పుణె తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిని రప్పించేందుకు రెండు ప్రధాన పార్టీలు అంతర్గతంగా ప్రత్యేకంగా విభాగాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి గ్రామంలో కొంతమంది నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించాయి. ఓటర్లకు రెండు రోజుల పాటు బస, ఇతర సదుపాయాలు, తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చూడడం వారి విధి.

ఇంటి కోసం ఒకే పార్టీ ఎమ్మెల్యేల పోటీ ఉప ఎన్నిక ప్రచారానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు తగిన వసతి దొరకట్లేదు. మంచి సౌకర్యాలున్న ఇల్లు దొరికితే అద్దె ఎంతయినా ఇవ్వడానికి వారు సిద్ధమవుతున్నారు. చండూరు పురపాలికకు సమీపంలోని రెండు ఎంపీటీసీల పరిధిలో ప్రచారానికి ఒక పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు. అన్ని సౌకర్యాలతో ఉన్న ఓ ఇంటి కోసం వారిద్దరూ పోటీ పడ్డారు. వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే 20 రోజులకు రూ.50 వేల అద్దె ఇస్తానని ప్రతిపాదించగా... ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఏకంగా రూ. లక్ష ఇచ్చి అద్దెకు తీసుకున్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.