కరోనా మహమ్మారి అందరినీ ఎంతగా ఇబ్బంది పెట్టిందో... ఇంకా పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ధాటికి ఎంతో మంది జీవితాలు అర్ధాంతరంగా రోడ్డు మీదకు వచ్చేశాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో... జోస్యం చెప్పే చిలుక పలుకులు మూగబోయాయి. నగరంలో పర్యాటక ప్రాంతంగా పేరొందిన ఎన్టీఆర్ మార్గ్‌లో లాక్‌డౌన్‌కు మందు ప్రతి రోజు చిలుక జోస్యం చెప్పించుకునే ఔత్సాహికులు కనిపించేవారు. జోస్యం చెప్పే వారు అంతే సంఖ్యలో ఉండేవారు. లాక్‌డౌన్ కారణంగా లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ మూసివేయడంతో సందర్శకులు లేక ఆ ప్రాంతమంతా వెలవెలబోయింది.
లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో చిలుక జోస్యం చెప్పేవారు గత నాలుగు రోజులు మళ్లీ ఉపాధి వేటలో పడ్డారు. చిలుక పలుకులు.. పలికితేనే బతుకు బండి నడుస్తుందని... కానీ ఇప్పుడు వాటి పలుకులు వినడానికి ఎవరూ రాక జీవనోపాధి కష్టంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి రోజు సుమారు రూ. 500 వరకు ఆదాయం వచ్చేదని... ఇప్పుడు కనీసం 10 రూపాయాలు కూడ రావడం లేదని వాపోతున్నారు. ఉదయం పూట రావడం.. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లిపోవడం తప్ప... దమ్మిడి కూడా ఆదాయం లేదని దీనంగా రోదిస్తున్నారు.
ఇదీ చూడండి : అక్కడ ఇసుక-బంగారం రెండూ ఒకటేనట..!