రాష్ట్రంలో అంకురాలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీహబ్ (T-Hub), వీహబ్(V-Hub), డేటా సెంటర్, టీవర్క్స్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచింది. ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పాడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోను టీహబ్ మాదిరి ఎం-హబ్ ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (Parliament Standing Committee) సైతం రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టీహబ్, తెలంగాణ డేటా సెంటర్‌ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేసింది.
ఎంపీల సందర్శన...
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన ఎంపీ రంజిత్ రెడ్డి, తమిళనాడు శివగంగ ఎంపీ కార్తి చిదంబరం, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్యతో కూడిన పలువులు ఎంపీల బృందం ఇన్నోవేషన్ ఎకోసిస్టం అధ్యయనంలో భాగంగా హైదరాబాద్ టీహబ్ సందర్శించారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఎంపీల బృందానికి టీహబ్‌తో పాటు తెలంగాణ ఎకోసిస్టంపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీహబ్‌లో ఏర్పాటు చేసిన హీమాక్ హెల్త్ కేర్, స్కైరూట్ ఎయిరోస్పేస్, మారుట్ డ్రోన్స్, గ్రావ్ టన్ మోటార్స్ వంటి పలు అంకురాల ప్రదర్శన ఎంపీలను ఆకట్టుకుంది.
ఈ మొత్తం ప్రదర్శన పట్ల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమిళనాడు ఎంపీ కార్తి చిదంబరం.. తమ రాష్ట్రంలోనూ ఈరకమైన ఇంక్యుబేటర్ అవసరముందని ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు. టీహబ్ టీం, అక్కడి అంకురాలతో సమావేశం అమితంగా ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు. దీన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఐటీ హబ్ సందర్శన తర్వాత ఎంపీల బృందం తెలంగాణ డేటా సెంటర్‌ను సందర్శించింది.
-
IT and Industries Minister @KTRTRS highlighted the Telangana State's IT ecosystem and the IT initiatives taken up by the Govt. of Telangana to the 'Standing Committee on Information Technology' which was chaired by MP @ShashiTharoor in Hyderabad. pic.twitter.com/fj4WMZvRKz
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">IT and Industries Minister @KTRTRS highlighted the Telangana State's IT ecosystem and the IT initiatives taken up by the Govt. of Telangana to the 'Standing Committee on Information Technology' which was chaired by MP @ShashiTharoor in Hyderabad. pic.twitter.com/fj4WMZvRKz
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 8, 2021IT and Industries Minister @KTRTRS highlighted the Telangana State's IT ecosystem and the IT initiatives taken up by the Govt. of Telangana to the 'Standing Committee on Information Technology' which was chaired by MP @ShashiTharoor in Hyderabad. pic.twitter.com/fj4WMZvRKz
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 8, 2021
ఇదీచూడండి: TS HIGH COURT: 'ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదు'