భాజపా రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్‌దయాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత విద్యాసాగర్ రావు దీన్‌దయాల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం సర్వస్వాన్నిఅర్పించిన వ్యక్తి దీన్‌దయాల్ అని లక్ష్మణ్ కొనియాడారు. అనేక కష్టాలు అనుభవించి ఉన్నత విద్యను అభ్యసించారని పేర్కొన్నారు. సమాజం పట్ల దేశం పట్ల అంకిత భావంతో జీవించారని తెలిపారు.
ఇదీ చూడండి : మహానగరంలో సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు