పండిట్ దీన్దయాల్ వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్లో భాజపా శ్రేణులు నిర్వహించాయి. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరై నివాళులు అర్పించారు. దయాల్ ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా చేరి అంచలంచెలుగా ఎదిగారని అన్నారు. పేదవారికి స్వాతంత్య్ర ఫలాలు అందాలన్నది వారి ఆశయం అన్నారు.
భాజపా ఏర్పాటైన తర్వాత ఆయన ప్రణాళిక, మానవితా విధానాలను పార్టీలో ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన సూత్రీకరించిన సిద్ధాంతంతోనే దేశంలో నీతి వంతమైన పాలన అందిస్తున్నామని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు, పార్టీ శ్రేణులు పాల్గొని నివాళులు సమర్పించారు.
ఇదీ చూడండి : ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్టు