కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి అంటూ తెగేసి చెప్పేస్తున్నారు ఓ కాలనీ వాసులు. సికింద్రాబాద్లోని పద్మశాలి కాలనీవాసులు కొవిడ్ నుంచి కాపాడుకునేందుకు 'మా ఇళ్లకు రాకండి' అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. 'దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి' అంటూ గేట్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.
గాలిలోనూ కరోనా వ్యాప్తి వేగంగా ఉందని వైద్యశాఖ చెప్పడంతో కాలనీ సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలనీవాసులు స్పష్టం చేశారు. గతేడాది ఇదే బాట పట్టిన కాలనీవాసులు వైరస్ మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో మరోసారి ఈమార్గాన్నే ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అత్యవసరమైతేనే కరోనా రోగులకు బెడ్లు: డీహెచ్ శ్రీనివాసరావు