Padmanabha Reddy allegations against Minister KTR : 'తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రూ. 3.3లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 22లక్షలపైగా ఉద్యోగాలు కల్పించినట్లు' మంత్రి కేటీఆర్ పేర్కొన్నారని.. దీనికి సంబంధించిన వివరాలు ఏ ప్రభుత్వ శాఖ వద్ద లేవని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి అన్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సంబంధిత శాఖలకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
- Foxconn Industry in Telangana : 'ఫాక్స్‌కాన్‌తో 35 వేల మందికి ఉపాధి'
- గుజరాత్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు: కేటీఆర్
పెట్టుబడులకు సంబంధించి వివరాలు ఇచ్చేలా సంబంధిత శాఖలను ఆదేశించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రికి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి వివరాలు ఇవ్వకపోతే.. ప్రజలు అంకెల గారడీగా భావించే అవకాశం ఉందని లేఖలో ప్రస్తావించారు. 'ఈ ఏడాది జనవరి 3వ తేదీన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ 9ఏళ్లలో రాష్ట్రానికి 3.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు' ప్రకటించారని పేర్కొన్నారు. అనంతరం జనవరి 5వ తేదీన పెట్టుబడులకు సంబంధించి వివరాలు కావాలని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శికి సమాచార హక్కు చట్టం కోరినట్లు పేర్కొన్నారు.
KTR comments on investments in Telangana : దీనిపై సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ తరువాత అప్పీల్‌కు వెళ్లగా.. తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఐదు నెలలు దాటినా పెట్టుబడులకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని పద్మనాభ రెడ్డి అన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించి వివరణ ఇవ్వాలని కోరారు.
దావోస్ పర్యటనలో రూ. 4200కోట్ల పెట్టుబడులు: గత నెలలో దావోస్‌లో పర్యటించిన కేటీఆర్ రూ.4200 కోట్లకు పైగా పెట్టుబడులను సమీకరించినట్లు వెల్లడించారు. 45 ప్రసిద్ధ సంస్థలతో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కేటీఆర్ చొరవతో దావోస్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు దానిని సందర్శించి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
పర్యటనలో కొన్ని సంస్థలు పెట్టుబడులు ప్రకటించగా.. మరికొన్ని విస్తరణకు ముందుకు వచ్చాయి. గత నెల 17వ తేదీన విదేశాలకు వెళ్లిన కేటీఆర్.. మొదట లండన్ వెళ్లారు. అక్కడ బ్రిటన్-భారత్ వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. తరువాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యారు.
ఇవీ చదవండి: