ETV Bharat / state

కేంద్రం నుంచి రాని స్పష్టత.. బియ్యం తీసుకుంటారా.. లేదా?!

రాష్ట్రం నుంచి బియ్యం తీసుకునే విషయమై కేంద్రం, ఎఫ్‌సీఐ నుంచి స్పష్టత రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మిల్లర్ల వద్ద ప్రస్తుతం దాదాపు కోటి మెట్రిక్ టన్నుల వరకు వరిధాన్యం నిల్వలున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి మిల్లింగ్ నిలిచిపోయింది. ఈ సీజన్ లో గరిష్ఠంగా పక్షం రోజులు కూడా మిల్లింగ్ కాకపోవడం ఇబ్బందికరంగా మారింది.

Paddy problems
Paddy problems
author img

By

Published : Jun 23, 2022, 5:44 PM IST

కేంద్రం నుంచి రాని స్పష్టత.. బియ్యం తీసుకుంటారా.. లేదా?!

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏప్రిల్ నెల ఉచిత బియ్యం పంపిణీ చేపట్టకపోవడంతో పాటు ధాన్యం నిల్వల్లో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోలేదంటూ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోవడాన్ని నిలిపేసింది. ఈ పరిణామం ఇటు ప్రభుత్వం... అటు మిల్లర్లకు సంకటంగా మారింది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద 3 సీజన్లకు చెందిన బియ్యం ఉన్నాయి. 2020-21 యాసంగి సీజన్, 2021-22 వానాకాలం సీజన్‌తో పాటు ఇటీవలి యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది.

మిల్లర్ల వద్ద కోటి మెట్రిక్ టన్నుల బియ్యం: ప్రస్తుత సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. వాటిని సాధారణ బియ్యంగా మార్చి ఇచ్చేందుకు మిల్లర్లకు అప్పగించింది. వీటితో పాటు గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన ధాన్యం కూడా మిల్లర్ల వద్దే ఉంది. వానాకాలానికి సంబంధించి దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉండగా... 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి ఐదు లక్షలకు పైగా ఉంది. దీంతో మొత్తంగా మూడు సీజన్లకు సంబంధించి కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఉంది. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు మిల్లింగ్ సాఫీగా జరగలేదు. అనుమతులు, వివాదాల నేపథ్యంలో సాధ్యం కాలేదు. ఇదే సందర్భంలో ఏప్రిల్, మే నెలల్లో రైసుమిల్లుల్లో భారత ఆహార సంస్థ తనిఖీలు చేసింది. రెండు నెలల్లో కలిపి పక్షం రోజులు కూడా మిల్లింగ్ జరగలేదు. తనిఖీల ప్రక్రియను పూర్తి చేసి జూన్ నెల మొదటి వారంలో అనుమతి ఇచ్చారు.

నిలిచిపోయిన మిల్లింగ్‌.. మూడు, నాలుగు రోజులు మిల్లింగ్ జరగగానే రాష్ట్రం నుంచి బియ్యం తీసుకునేది లేదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. అప్పట్నుంచి రాష్ట్రంలో మిల్లింగ్ నిలిచిపోయింది. ఎఫ్‌సీఐ నుంచి లేఖ రాగానే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం... ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించి ఈ నెల నుంచి ప్రారంభించింది. అటు ధాన్యం నిల్వల్లో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది. కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, మరికొందరి నుంచి ధాన్యం వసూలు చేసినట్లు వివరించింది. మిగతా మిల్లర్లపైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ అంశాలన్నింటిని పొందుపరుస్తూ ఎఫ్‌సీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ రాసి ఇప్పటికే పక్షం రోజులు గడచినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. ఇటీవల దిల్లీ వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... కేంద్ర ఆహారశాఖ అధికారులతో చర్చించారు. మూడు రోజుల క్రితం పౌరసరఫరాలశాఖ అధికారులు సైతం హస్తిన వెళ్లారు. కేంద్ర ఆహారశాఖ అధికారులతో పాటు ఎఫ్‌సీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

చాలా చోట్ల నిల్వకు సామర్థ్యం లేక మిల్లర్లు ధాన్యాన్ని బయటే ఉంచారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వానలు ఉధృతంగా కురిస్తే ఇబ్బందులు తప్పబోవని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు అనుమతి ఇచ్చినప్పటికీ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లింగ్ పూర్తయ్యేందుకు ఏడాదికిపైగా పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లోగా మళ్లీ ధాన్యం మిల్లర్లకు రానుంది. ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోవడంతో పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన డబ్బు కూడా రావడం లేదు.
ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.