ETV Bharat / state

భారతదేశానికి అక్షయ పాత్రగా తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో టాప్​! - తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి

భారతదేశానికి అక్షయపాత్రగా తెలంగాణ ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అతి కొద్ది కాలంలోనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. భారత ఆహార భద్రత సంస్థ ఆధ్వర్యంలో నిలవ ఉన్న ధాన్యంలో దాదాపు 63 శాతం వాటా తెలంగాణదే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్​.. భారీ స్థాయిలో ధాన్యం ఉత్పత్తికి దోహదపడ్డాయి.

paddy cultivation, telangana
తెలంగాణ, ధాన్యం ఉత్పత్తి
author img

By

Published : Jan 15, 2021, 1:58 PM IST

2019-20 సంవత్సరంలో 1.3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. భారత ఆహార సంస్థ(ఎఫ్​సీఐ)లో నిలవ ఉన్న ధాన్యంలో రాష్ట్రం వాటా 63 శాతం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల కింద వరి సాగు పెరగటంతో గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా ఉత్పత్తయింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాదాపు 14.19 లక్షల హెక్టార్లలో రైతులు వరి పండించారు. 2015-16 లో 29.6 లక్షల టన్నులు, 2016-17 లో 51.7 లక్షల టన్నులు, 2017-18లో 62.5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.

సాగుకు ప్రాజెక్టులు..

కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు, మిషన్​ కాకతీయ పథకం ద్వారా బావుల పునరుద్ధరణ తదితర వాటి ద్వారా 60 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు జరిగిందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్​టీసీసీఐ).. నివేదికలో వెల్లడించింది. రైతులకు 24 గంటల విద్యుత్ సదుపాయం కల్పించడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వివరించింది. ​ఖరీఫ్​ సీజన్​లో 47 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. యాసంగిలో 65 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలంగాణ పౌర సరఫరాల సంస్థ తెలిపింది. ఈ ఆరేళ్లలో ధాన్యం సేకరణలో 367 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

ఈ మేరకు 40 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని నిలువచేసేలా గిడ్డంగులతోపాటు నిర్వహణకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని తాజా నివేదిక ప్రకారం సీఎం కేసీఆర్.. అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో పంట సాగు కోసం గోదావరి, కృష్ణా జలాల నుంచి 1,300 టీఎంసీల నీటిని వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎగుమతులకు ఆటంకం

దేశంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ఎగుమతుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎగుమతిలో వెనుకంజలో ఉంది. అధిక రవాణా ఖర్చులు, మోతాదుకు మించి పురుగు మందులు వాడటం, గిడ్డంగుల కొరత, సోనా బియ్యం వైపు రైతులు మొగ్గు చూపడం తదితర కారణాల ద్వారా రాష్ట్రంలో ఎగుమతులు తగ్గినట్లు ఎఫ్​టీసీసీఐ నివేదించింది. ధాన్యం ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో సోనా బియ్యం పండించేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహించింది. కానీ అంతర్జాతీయ మార్కెట్​లో బాస్మతి బియ్యానికి ప్రాధాన్యం ఉండటం.. ఈ రకం బియ్యం ఎగుమతులపై ప్రభావం చూపింది.

మార్పులు అవసరం

ఈ మేరకు బాస్మతి, సోనా పంటలకు ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తే సత్ఫలితాలు పొందవచ్చని ఎఫ్​టీసీసీఐ సూచించింది. రాష్ట్రంలో ఉన్న రైస్​ మిల్లులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పించి వాటిని నవీకరించాలని తెలిపింది. మిల్లింగ్ సామర్థ్యం, ​​మెరుగైన పరీక్ష, ధాన్యం నిల్వ, ఇతర దేశాలకు అమ్మేందుకు మౌలిక సదుపాయాలను కల్పించినట్లయితే.. రైతుల ఆదాయం పెరిగే ఆవశ్యకత ఉందని ఎఫ్​టీసీసీఐ నివేదికలో వెల్లడించింది.

ఇదీ చదవండి: 'పంచాయతీల ప్రగతిపై సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.