తెలంగాణ రాష్ట్రంలో 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గడువు ముగిసి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా వేయిదా వేస్తూ వచ్చిందని.. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని భాజపా తప్పుపట్టింది. సహకార సంఘాలు, డీసీసీబీల పునర్ వ్యవస్థీకరణ, సహకార రంగంలో సమూల సంస్కరణలు చేస్తామని.. ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అకస్మాత్తుగా ఎన్నికలు నిర్వహించనుండటం ఆశ్చర్యకరమని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి పేర్కొన్నారు.
డీసీసీబీలను పున: వ్యవస్థీకరించాలి: భాజపా - డీసీసీబీల పునర్ వ్యవస్థీకరణ
రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బేరసారాలకు అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. కొత్త మండలాల ప్రకారం సహకార సంఘాల పున: వ్యవస్థీకరణ జరగాలని.. ప్రతి మండలానికి రెండు పీఏసీఏసీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.