కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ట్యాంకర్‌ను బేగంపేట్ విమానాశ్రయం నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా పంపించారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్‌ను తీసుకొచ్చారు.
నగర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రహదారిపై ట్యాంకర్ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా... ఆస్పత్రికి వేగంగా చేరేలా వ్యవహరించారు.