ETV Bharat / state

Own Vehicles Increased: 'ప్రజారవాణా కంటే.. సొంత వాహనమే బెస్ట్‌' - హైదరాబాద్‌లో పెరిగిన సొంతవాహనాలు

Own Vehicles Increased: ప్రజారవాణా కంటే... సొంతవాహనాలపైనే జనం మక్కువ చూపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వాహన విక్రయాలు పెరుగుతుండగా... కొవిడ్‌ వల్ల ఆ సంఖ్య మరింత పెరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా అందుబాటులో లేకపోవడం వల్లే సొంత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

own vehicles increased in telangana
ప్రజారవాణా కంటే.. సొంత వాహనమే బెస్ట్‌ అంటున్న గ్రేటర్ వాసులు
author img

By

Published : Jun 1, 2022, 5:51 AM IST

ప్రజారవాణా కంటే.. సొంత వాహనమే బెస్ట్‌ అంటున్న గ్రేటర్ వాసులు

Own Vehicles Increased: సాధారణంగా నగరాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజారవాణాపై దృష్టిసారించాలి. విశ్వనగరంగా అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్‌లో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గత పదేళ్లలో నగర విస్తరణకు అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ధి చెందకపోవడం వల్లే ప్రజలు సొంత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో ప్రజారవాణా గణనీయంగా అభివృద్ధిచెందితే హైదరాబాద్‌లో మాత్రం తగ్గుముఖం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ తగ్గిపోవడం వల్ల ప్రజలు సొంతవాహనాల వైపు మళ్లుతున్నారని చెబుతున్నారు. వాటికి తోడు. కొవిడ్‌ విసిరిన సవాళ్లతో ... చాలామంది సొంతవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్‌లో ఇలా... గ్రేటర్‌లో ఏటా సుమారు 2 లక్షలకుపైగా కొత్తవాహనాలు రోడ్డెక్కుతున్నాయి. హైదరాబాద్‌లో 2020లో 65 లక్షల వాహనాలుంటే.. ప్రస్తుతం 70 లక్షలు దాటిపోయాయి. రవాణా శాఖ గణాంకాల ప్రకారం 70 లక్షల్లో సుమారు 45 లక్షలవరకు ద్విచక్రవాహనాలుండగా.... మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. ప్రజారవాణా మెరుగుపడకపోవడం సహా వివిధ కారణాలతో సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.

''ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. ఆటోవాళ్లు కూడా తాగుతారు. సరిగ్గా ఉండరు. పోనీ బుక్‌ చేసుకుందాం అంటే వాళ్లు ఎలాంటి వారో తెలియదు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావ్ అంటే లోకేషన్ ప్రకారం పోతున్నా అంటారు. అందుకే మేం సొంత వాహనం కొన్నాం.'' - సొంత వాహనదారుడు

కరోనా భయంతో... పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా సేవలు విస్తరించకపోవడం వల్ల వ్యక్తిగత వాహన విక్రయాలు జోరందుకున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. 2012 నాటి గణాంకాల ప్రకారం.. నగరంలో 3వేల850 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుండగా... 2022 నాటికి వాటి సంఖ్య 2వేల 550కి తగ్గిపోయాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులను అధికారులు కుదించారు. కొవిడ్‌ తర్వాత ఎంఎంటీఎస్‌ సర్వీసులు తగ్గడం సహా కరోనా భయంతో ప్రజలు సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

''కొవిడ్ వల్ల ప్రజారవాణా తగ్గింది. ట్రైన్స్‌, ఎంఎంటీఎస్‌ కూడా ఆపేశాం. దానివల్లే సొంతవాహనాలు పెరిగాయి. హైదరాబాద్‌లో లక్షవాహనాలు రిజిస్ట్రేషన్‌ అయితే.. ఈసారి లక్ష 50వేలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.'' - పాండురంగానాయక్, హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

ఇప్పటికైనా ప్రభుత్వం... ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపరిస్తే రానున్న రోజుల్లో వ్యక్తిగత వాహనాల విక్రయాలు తగ్గే అవకాశముందని... రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత వాహనాలు పెరిగితే కాలుష్యం పెరిగి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదంఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.