ETV Bharat / state

లాక్‌డౌన్‌ రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం - Owaisi says lockdown by Centre is unconstitutional

కరోనా నియంత్రణకు దేశంలో విధించిన లాక్‌డౌన్‌ రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం విమర్శించింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వలస కూలీలను ఆదుకోవడానికి ఉపశమన చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశం మొత్తాన్నీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ పరిధిలోకి తీసుకురాజాలదని.. ఇది సమాఖ్యవాదానికి విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు విప్పడం లేదో తనకు అర్థం కావడంలేదన్నారు.

Lockdown unconstitutional: MIM
లాక్‌డౌన్‌ రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం
author img

By

Published : May 13, 2020, 9:50 AM IST

కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికి దేశంలో విధించిన లాక్‌డౌన్‌ రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వలస కూలీలను ఆదుకోవడానికి ఉపశమన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

‘‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం కింద దేశం మొత్తాన్నీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ పరిధిలోకి తీసుకురాజాలదు. ఇది సమాఖ్యవాదానికి విరుద్ధం. ఈ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు విప్పడం లేదో నాకు అర్థం కావడంలేదు’’

- ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ

ఇటీవల తెలంగాణలోని భైంసాలో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకోవాలని ఒవైసీ కోరారు. నిందితుల మతం, పార్టీ వంటి అంశాలతో సంబంధం లేకుండా చర్యలు ఉండాలన్నాారు.

ఇదీ చూడండి: లాక్‌డౌన్‌ వేళ.. హైదరాబాద్‌లో రోడ్లు ఇలా...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.