సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్థనూరు కూడలి బాహ్యవలయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముత్తంగి వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. ఆటో క్యాబిన్లో ఉన్న రామిరెడ్డి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరినీ తొలుత పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్నక్రమంలో మార్గమధ్యలోనే రామిరెడ్డి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్