దిశ ఘటనపై కేసును వేగంగా దర్యాప్తు జరిపి నిందితులకు తక్షణమే శిక్ష పడేలా చొరవ తీసుకోవాలని తెలుగు నటీనటుల సంఘం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి కోరారు.
తెలుగు నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ , ఉపాధ్యక్షురాలు హేమతోపాటు మా సభ్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై తమ ఆవేదనను వివరించారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్