అమెరికాకు చెందిన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా జరిపిన అత్యుత్తమ శాస్త్రవేత్తల సర్వేలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భౌతికశాస్త్రం ప్రొఫెసర్ దాచెపల్లి రవీందర్‌కు స్థానం లభించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన వివిధ అంశాల్లో పరిశోధనలకు గాను రవీందర్‌కు ఈ విశిష్ఠ స్థానం కల్పించినట్లు యూనివర్సిటీ తెలిపింది. ఆయన రాసిన ఎన్నో పరిశోధక వ్యాసాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
రవీందర్ గతంలో యంగ్ సైంటిస్ట్ అవార్డు, యూజీసీ కెరీర్ అవార్డు, బాయ్ కాట్ ఫెలోషిప్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. పరిశోధనల నిమిత్తం అమెరికా, ఇంగ్లండ్, స్వీడన్, ఐర్లాండ్, కెనడా, సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించారు. ప్రపంచ రెండోస్థాయి అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో రవీందర్ స్థానం పొందడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు లభించిందని తోటి ప్రొఫెసర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఈ నెల 12న రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు: టీపీసీసీ