ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతూ రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే భారీ బహిరంగ సభను నిర్వహించి తీరుతామని విద్యార్థి సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సభకు అనుమతి లేదని చెప్పటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభను నిర్వహించి తీరుతామని ఐక్య విద్యార్థి సంఘాలు తెలిపాయి.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ