జీనా హై తో మర్నా సికో అంటూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రగతిశీల భావజాలం వైపు నడిపించేటువంటి మహోన్నత వ్యక్తి జార్జిరెడ్డి... అతని జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమాకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ అధిక సంఖ్యలో రావడం విశేషమని పీడీఎస్‌యూ విద్యార్థి నాయకులు అన్నారు. జార్జిరెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమంలో మరింత ముందుకు సాగుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తార్నాక ఆరాధన థియేటర్ ప్రాంగణంలో జార్జిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఓయూ విద్యార్థులందరూ కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఒక విద్యార్థి నాయకుడి పేరును బయటకు తీసుకువచ్చినందకు సినిమా డైరెక్టర్ జీవన్‌రెడ్డిని అభినందించారు.
ఇదీ చూడండి: పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన