ETV Bharat / state

Osmania Hospital: ఉస్మానియా ఘనత.. తొలిసారి మానవ చర్మం సేకరణ - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital) మరో ఘనత దక్కించుకుంది. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ మహిళ నుంచి చర్మాన్ని సేకరించింది. దాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చర్మనిధి బ్యాంకులో భద్రపరిచినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు.

Osmania Hospital
Osmania Hospital
author img

By

Published : Oct 29, 2021, 12:08 PM IST

ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital) వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ మహిళ నుంచి చర్మాన్ని సేకరించి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చర్మనిధి బ్యాంకులో భద్రపరిచారు. ఇటీవల ప్రమాదంలో గాయపడి, జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 53 ఏళ్ల మహిళ బ్రెయిన్‌డెడ్‌ అయింది. ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కాలేయం, మూత్రపిండాలతోపాటు చర్మదానానికీ అంగీకరించారు. ఉస్మానియాకు చెందిన చర్మనిధి నిపుణులు అపోలో ఆసుపత్రిలో ఆమె చర్మాన్ని సేకరించి, చర్మనిధి కేంద్రానికి తరలించినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ నుంచి 16 స్కిన్‌ గ్రాఫ్ట్‌లను సేకరించినట్లు వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆసుపత్రులు గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు చేస్తున్నాయి. చర్మాన్ని సేకరించి భద్రపరిచే సాంకేతికతను ఏ ఆసుపత్రీ నిర్వహించడం లేదు. కాలిన గాయాలకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ ఏర్పాట్లు లేవు. ఉస్మానియా ఆసుపత్రిలో హెటిరో డ్రగ్స్‌, రోటరీ క్లబ్‌ సాయంతో దాదాపు రూ.70 లక్షలు వెచ్చించి ఇటీవల చర్మనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జీవన్‌దాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి నుంచి చర్మాన్ని సేకరించి ఇక్కడ భద్రపర్చి, అవసరమైన వారికి వినియోగిస్తారు. తొలిసారి ఉస్మానియాలో ఇలాంటి బ్యాంకు అందుబాటులోకి రావడం విశేషమని.. ఇందుకు కృషి చేసిన వైద్యులు, సాంకేతిక నిపుణులను డాక్టర్‌ నాగేందర్‌ అభినందించారు. ఒకసారి సేకరించిన చర్మాన్ని అయిదేళ్ల వరకు భద్రపరిచే అవకాశం ఉస్మానియా కేంద్రంలో ఉందని ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నాగప్రసాద్‌ తెలిపారు. చర్మ బ్యాంకు సమన్వయకర్త డాక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డాక్టర్‌ నిశాంత్‌ పాల్గొన్నారు.

చర్మనిధి బ్యాంకులో  భద్రపరుస్తున్న ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌

ఇవీ ఉపయోగాలు..

  • కాలిన గాయాలు, చేతులు, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాల్లో తీవ్ర గాయాలు, గ్రహణం మొర్రి, కుష్ఠు వ్యాధితో వంకరైన చేతులు, కాళ్లు సరిచేయడం, తెగిన చేతులు, వేళ్లు అతికించడం.. ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం.
  • ఇప్పటివరకు రోగి శరీరంలోనే కాళ్లు, చేతులు, తొడలు, పుర్రె తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్‌ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు. రోగి శరీరం నుంచి 15-20 శాతం సేకరించే అవకాశం ఉంది. చర్మ బ్యాంకుతో కొరత తీరనుంది.
  • ప్రమాదాల్లో గాయపడి ఉస్మానియాకు వస్తున్న బాధితుల్లో చర్మం అందుబాటులో లేక ఏటా 120 మంది మృతి చెందుతున్నారు.
  • చర్మంలో ఎపిడెర్మీస్‌, డెర్మీస్‌, డీప్‌ డెర్మీస్‌, సబ్‌క్యుటేనియస్‌ టిష్యూ పొరలుంటాయి. అగ్నిప్రమాదాల్లో గాయపడిన చాలామందిలో డీప్‌ డెర్మీస్‌, అంతకంటే కింది పొరలు దెబ్బతింటాయి. శరీరంలోని ప్రొటీన్‌ మొత్తం నీటి రూపంలో బయటకు పోతుంది. ఎక్కువ మంది ఇన్‌ఫెక్షన్లు సోకి మృతి చెందుతుంటారు. శరీరమంతా తీవ్ర గాయాలైతే చికిత్స కష్టమవుతుంది. ఇలాంటి వారికి తాత్కాలికంగా చర్మాన్ని గ్రాఫ్టింగ్‌ చేసి ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తారు. రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడతారు. ఇది మూడు వారాలపాటు రక్షణ ఇస్తుంది. ఆ తర్వాత ఊడిపోతుంది.

ఇదీ చదవండి: world stroke day 2021: బ్రెయిన్‌ స్ట్రోక్‌.. ఈ లక్షణాలున్నాయా? అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.