ETV Bharat / state

ORR: ఔటర్​ రోడ్డుకు ఇరువైపులా పరుచుకున్న పచ్చందాలు

author img

By

Published : Jun 14, 2021, 12:36 PM IST

Updated : Jun 14, 2021, 12:41 PM IST

రాజధానికి మణిహారంగా ఉన్న అవుటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌) రూపు మారుతోంది. కొత్త సర్వీసు రోడ్లు, ప్రధాన రహదారులకు మెరుగులద్దే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ హంగులకు తోడు రోడ్డెక్కితే ఎటు చూసినా కనుచూపుమేర పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యతను హెచ్‌ఎండీఏ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విద్యుద్దీపాలతో పాటు ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. సరిగ్గా 11 నెలల్లోనే రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎటుచూసినా పచ్చదనం పరుచుకుంది.

orr filled with greenery in 11 months in hyderabad
ORR: ఔటర్​ రోడ్డుకు ఇరువైపులా పరుచుకున్న పచ్చందాలు

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌(ORR) నిర్వహణ అదే స్థాయిలో ఉండేందుకు హెచ్‌ఎండీఏ(HMDA) ప్రణాళికలు రూపొందిస్తోంది. రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రధాన రహదారి, సర్వీసు రోడ్లను శుభ్రం చేసే బాధ్యత ఏజెన్సీలదే. ప్యాకేజీ-1లో పెద్ద అంబర్‌పేట నుంచి శంషాబాద్‌ ఇంటర్‌ఛేంజ్‌ వరకు, ప్యాకేజీ-2లో గచ్చిబౌలి నుంచి పటాన్‌చెరు వరకు విభజించారు. ఇందుకు టెండర్లు పిలిచారు. ఈనెల 15వ తేదీ వరకూ దాఖలుకు అవకాశం ఇచ్చారు.

పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి

ఏడాదిలోపే రూపుమారింది

ఏడాదిలోపే ఓఆర్‌ఆర్‌ రూపుమారింది. హెచ్‌జీసీఎల్‌(Hyderabad Growth Corridor Limited‌) బృందం హరితహారం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టింది. అన్ని ఇంటర్‌ఛేంజ్‌లు, మీడియన్లతో పాటు రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ పకడ్బందీగా చేయడంతో అంతటా పచ్చదనం పరుచుకుంది.

-అర్వింద్‌కుమార్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి

ఇదీ చూడండి: weather report: స్థిరంగా అల్పపీడనం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం

Last Updated : Jun 14, 2021, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.