ETV Bharat / state

రైతుల నుంచి కొనుగోలు చేస్తూ... పోలీసులకు అందిస్తూ...

author img

By

Published : Apr 21, 2020, 7:29 PM IST

కరోనా వైరస్​ను ఎదుర్కునేందుకు విటమిన్-సీ కలిగిన పండ్లను తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన విధంగా... రైతుల నుంచి బత్తాయిలు కొనగోలు చేసి... వాటిని నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు దాతలు అందిస్తున్నారు.

oranges-distribution-for-police-at-cybarabad-cp-office
రైతుల నుంచి కొనుగోలు చేస్తూ... పోలీసులకు అందిస్తూ...

సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బత్తాయి రైతులను ఆదుకోవాలనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూచన మేరకు... శివ రామ కృష్ణ ట్రస్ట్ ముందుకు వచ్చింది. రైతుల నుంచి బత్తాయిలను కొనుగోలు చేసి... నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అధికారులకు అందించింది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 5,500 మంది పోలీసులకు 25 టన్నుల బత్తాయి పండ్లు పంపిణీ చేశారు.

''శివ రామ కృష్ణ ట్రస్ట్ వారు రైతుల నుంచి బత్తాయిలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విటమిన్​-సీ ముఖ్యపాత్ర వహిస్తుందని ముఖ్యమంత్రి సూచించగా... వాటిని నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అందిచండం గొప్ప విషయం. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు. 'ప్రజలందరూ కరోనాపై పోరాడాలి. విటమిన్​ సీ ఉన్న పండ్లను అధిక మోతాదులో తీసుకోవాలి. లాక్​డౌన్​ పాటిస్తూ... ఇంటి నుంచి బయటకు రాకుండా సహకరించాలి.''

-సీపీ సజ్జనార్

ఇవీ చూడండి: 'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.