ETV Bharat / state

బీఆర్ఎస్‌కు చెక్‌పెట్టడమే లక్ష్యం - ప్రచారంలో తగ్గేదేలే అంటున్న విపక్షాలు - Political heat in Telangana with party campaigns

Opposition parties Telangana Elections Campaign 2023 : రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం మొదలుకానుండటంతో రాజకీయ పార్టీల ప్రచారాలు సైతం హోరెత్తుతున్నాయి. అధికార బీఆర్ఎస్‌కు దీటుగా విపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఊరూవాడ చుట్టేస్తున్న అభ్యర్థులు.. ఇంటింటికి వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.

Telangana Elections Campaign 2023
Telangana Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 8:32 AM IST

అధికార బీఆర్ఎస్‌కు దీటుగా విపక్షాల ప్రచారం

Opposition parties Telangana Elections Campaign 2023 : హైదరాబాద్ ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాస్కీని (Madhu Yashki) కలిసిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన కాంగ్రెస్‌ యువగర్జన సభకు ఆందోల్‌ అభ్యర్థి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఖమ్మం నగరం 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ జాన్‌బీ, ఆమె భర్త నాగుల్‌మీరా.. మాజీ మంత్రి తుమ్మల సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.

Telangana Congress Election Campaign 2023 : ఖమ్మం గ్రామీణ మండలం తెల్లారిపల్లిలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పొంగులేటి సమక్షంలో హస్తం గూటికి చేరారు. కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్, కేశవపూర్, బావుపేట గ్రామాల్లో హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Telangana Election Campaign in WhatsApp : వాట్సాప్‌ గ్రూపుల్లో ఎన్నికల ప్రచారం.. స్పేస్‌ అంతా లాగేస్తోందని వాపోతున్న యూజర్స్

హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన ఏఐసీసీ ప్రతినిధి డాలీశర్మ.. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సింగాపురం ఇందిర పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్, తోనిగండ్ల, లక్ష్మాపూర్, కాట్రియాల్, పర్వతాపూర్, కిషన్‌తండా, దంతేపల్లి గ్రామాల్లో మెదక్‌ హస్తం పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Congress Election Campaign Telangana 2023 : మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి.. బూత్‌ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. మేడ్చల్‌ హస్తం పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేశ్‌.. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఘట్‌కేసర్‌లో ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టికెట్‌ మల్‌రెడ్డి రంగారెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్తూ.. దండెం రాంరెడ్డి వర్గీయులు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ టికెట్‌ విశ్రాంత ఐపీఎస్‌ నాగరాజుకు కేటాయించటం పట్ల ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహానికి గురయ్యారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో పర్యటిస్తున్న నాగరాజు వాహనంపై పలువురు కార్యకర్తలు దాడిచేయగా.. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

BJP Election Campaign Telangana 2023 : సనత్‌నగర్‌ బీజేపీ టికెట్‌ను మర్రి శశిధర్‌రెడ్డికి కేటాయించటం పట్ల ఆయన అనుచరులు టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ముషీరాబాద్ భారతీయ జనతా పార్టీ టికెట్ పూస రాజుకు ఇవ్వటం పట్ల.. కమలం కార్యకర్తలు రాంనగర్‌లో స్వీట్లు పంచుకుని, తమ నేతను సన్మానించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణను ఖరారు చేయటం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు.

పెద్దపల్లి జిల్లా మంథని బీజేపీ అభ్యర్థిగా సునీల్‌రెడ్డిని ప్రకటించటం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డి పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చొప్పదండి నియోజకవర్గంలో కమలం పార్టీ అభ్యర్థి బొడిగె శోభ ప్రచారం చేశారు. ఈటల రాజేందర్‌ను గెలిపించాలంటూ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం వంతడుపుల, బుజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి గ్రామాల్లో ఈటల సతీమణి జమున ఓట్లు అభ్యర్థించారు. స్థానిక నాయకులు మంగళహారతులతో ఆమెకు స్వాగతం పలికారు.

రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ పార్టీల మధ్యే ప్రధాన పోరు

Telangana Election Campaign 2023 : ముఖ్యమంత్రి తీరుపై బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శలు గుప్పించారు. గజ్వేల్ బరి నుంచి ఈటల తప్పుకుంటున్నట్టు అసత్య ప్రచారం జరుగుతుందని.. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు కప్పర ప్రసాద్‌రావు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగిన భారతీయ జనతా పార్టీ జనగర్జన సభకు హాజరైన ఆయన.. బీఆర్ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

"కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు ఓటేసినా అక్కడికే పోతుంది. కేసీఆర్ అతితక్కువ కాలంలోనే వేలకోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ డబ్బుతో ఓట్లు కొనేందుకు వస్తున్నారు." - ఈటల రాజేందర్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్

కొత్తగూడెం సీపీఐ టికెట్‌ను పార్టీ జిల్లా కార్యదర్శి షాబిర్‌ పాషాకు కేటాయించాలంటూ కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు, పార్టీ నేతలు రాజీనామా చేశారు. ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థుల మూడోజాబితాతో పాటు మ్యానిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో జరిగిన ఓటరు చైతన్య కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళి పాల్గొన్నారు.

Opposition parties Telangana Election Campaign 2023 : బీఆర్​ఎస్​ని అధికారం నుంచి దించేందుకు.. ప్రతిపక్షాల వ్యూహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.