కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ బిల్లుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. రైతులకు మేలు జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని వివరించారు.
దళారి వ్యవస్థ నుంచి రైతులకు విముక్తి కలిగించేందుకు తీసుకొచ్చిన ఈ బిల్లుపై.. ప్రతిపక్షాలు రైతులను తప్పు దోవ పట్టిస్తున్నాయని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రైతులు పండించిన పంటకు అదనంగా 50 శాతం లాభం చేకూర్చే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నించిందని.. చివరకు దళారి వ్యవస్థకు తలొగ్గి బిల్లును తీసుకురాలేదన్నారు. రైతుల హక్కులను కాపాడే ఈ బిల్లుకు అందరూ మద్దుతు పలకాలని కోరారు.
ఇదీచూడండి.. 'కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చారు'