ETV Bharat / state

Saidabad rape case: 'సైదాబాద్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి... నిందితున్ని శిక్షించాలి' - గిరిజన బాలిత అత్యాచారం

సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో బాలికను హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. బాధిత కుటుంబాన్ని నేతలు పరామర్శించారు. వారికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ ఘటనను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.

Saidabad rape case
Saidabad rape case
author img

By

Published : Sep 13, 2021, 10:36 PM IST

'సైదాబాద్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి... నిందితున్ని శిక్షించాలి'

సైదాబాద్‌లో బాలిక అత్యాచారం, హత్య ఘటనపై త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు... రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. బాలిక కుటుంబ సభ్యులను కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క... వారికి ధైర్యం చెప్పారు. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలున్నట్లు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబ సభ్యులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందించారు. అరడజనకు పైగా మంత్రులు హైదరాబాద్‌లో ఉన్నా... కనీసం పరామర్శించటానికి వెళ్లలేదన్నారు. నగరం నడిబొడ్డులో ఇలాంటి ఘటన జరిగితే... ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరగడం లేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలే కారణం

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హేయమైనదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెరాస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తూ యువకులను మద్యానికి బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తుండటం దారుణమని... దీనికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మండిపడ్డారు. ఈ ఘటనపై చర్యలకు ఉపక్రమించని హోంమంత్రి మహమూద్‌ అలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నామమాత్రపు హోంమంత్రి అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింగరేణి కాలనీలాంటి దురదృష్ట ఘటనలు జరుగుతున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. బాలిక తల్లిదండ్రులను ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. సామాజిక న్యాయం కావాలని తెచ్చుకున్న తెలంగాణలో గిరిజన మహిళలు, పిల్లలకు భద్రతలేకుండా పోయిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. చిన్నారిని హత్యాచారం చేస్తే గిరిజన మంత్రి, ఎంపీలు కూడా పరామర్శించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌ కూడా బాధిత చిన్నారి కుటుంబసభ్యులను కలవలేదని విమర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. ఈ ఘటన కలిచివేసిందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్​ఎస్​ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేస్తోందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళన

నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చేశాయి. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు రిషి నిలయం సోషల్ వాలంటరీ ఆర్గనైజైషన్ ప్రతినిధులు, భాజపా మహిళా నేతలు చిన్నారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నిందితుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్ప‌డిన నిందితున్ని క‌ఠినంగా శిక్షించాల‌ని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ నేతలు మ‌హిళా క‌మిష‌న్‌ను కోరింది. ఈమేర‌కు మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డికి విన‌తిప‌త్రం ఇచ్చారు. అనంత‌రం సింగ‌రేణి కాల‌నీవాసులు చేప‌డుతున్న దీక్ష‌కు సంఘీభావం తెలిపి ధ‌ర్నా నిర్వ‌హించారు.

సుమోటోగా విచారణ

చిన్నారి హత్యాచారం ఘటనను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్​కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్​కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు బి.అపర్ణ, అంజన్ రావు ఇవాళ చిన్నారి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక సాయం, సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని.. అధికారుల విచారణను నిరంతరం పర్యవేక్షిస్తామని బాలల హక్కుల కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : 9 గంటలపాటు నవదీప్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.