ETV Bharat / state

సెకండ్ ఛాన్స్... సింగరేణిలో వారికి మళ్లీ ఉద్యోగం

గత ఎనిమిదేళ్లలో వివిధ కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించిన కార్మికులను మళ్లీ చేర్చుకోవాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది.

సింగరేణి
author img

By

Published : Sep 20, 2019, 11:36 PM IST

ఉద్యోగం కోల్పోయిన వారికి మళ్లీ అవకాశం

వివిధ కారణాలతో ఉద్యోగం కోల్పోయిన సింగరేణి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో సుమారు 356 మందికి తిరిగి ఉద్యోగాలు దక్కనున్నాయి. డిస్మిస్ అయిన ఉద్యోగులు, గుర్తింపు కార్మిక సంఘం వినతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం వల్ల సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.

46 ఏళ్లు దాటొద్దు...

ఒప్పందం ప్రకారం 2000 సంవత్సరం జనవరి 1 నుంచి గతేడాది డిసెంబరు 31 వరకు అనారోగ్యం కారణంగా ఉద్యోగం కోల్పోయిన కార్మికులు తిరిగి ఉద్యోగం పొందేందుకు అర్హులు. డిస్మిస్ అయ్యే నాటికి ముందు ఐదేళ్లలో కనీసం రెండేళ్లకాలంలో వంద హాజరు దినాలు పూర్తి చేసి ఉండాలని.. 46ఏళ్ల వయసు దాటి ఉండొద్దని నిబంధన విధించారు. అలాగే గతంలో డిస్మిస్ అయి, తిరిగి ఉద్యోగంలో చేరి.. మొదటి సంవత్సరంలో కనీసం 190 మస్టర్లు కూడా పూర్తి చేయక మళ్లీ ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా మరో అవకాశాన్ని కల్పించారు. తిరిగి ఉద్యోగంలో చేరాలనుకునే అర్హులైన కార్మికులు వైద్య పరీక్షలలో ఫిట్ కావాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి: 30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది

‍‍TG_HYD_60_20_SINGARENI_DISMISSED_WORKERS_DRY_3064645 REPORTER: Nageshwara Chary ( ) గత ఎనిమిదేళ్లలో వివిధ కారణాల వల్ల గైర్హాజరుతో ఉద్యోగం నుంచి తొలగించిన కార్మికులను మళ్లీ చేర్చుకోవాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. సింగరేణి యాజమాన్యం, గుర్తింపు పొందిన కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో సుమారు 356 మందికి ఒక్క అవకాశం కింద తిరిగి ఉద్యోగాలు దక్కుతాయని సింగరేణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పేర్కొన్నాయి. డిస్మిస్ అయిన ఉద్యోగులు, గుర్తింపు కార్మిక సంఘం వినతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో... ఇవాళ సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఒప్పందం ప్రకారం 2000 సంవత్సరం జనవరి 1 నుంచి గతేడాది డిసెంబరు 31 వరకు అనారోగ్యం కారణంగా ఉద్యోగం కోల్పోయిన కార్మికులు తిరిగి ఉద్యోగం పొందేందుకు అర్హులు. అయితే డిస్మిస్ అయ్యే నాటికి ముందు ఐదేళ్లలో కనీసం రెండేళ్ల కాలంలో వంద హాజరు దినాలు పూర్తి చేసి ఉండాలని.. 46ఏళ్ల వయసు దాటి ఉండొద్దని నిబంధన విధించారు. అలాగే గతంలో డిస్మిస్ అయి, తిరిగి ఉద్యోగంలో చేరి.. మొదటి సంవత్సరంలో కనీసం 190 మస్టర్లు కూడా పూర్తి చేయక మళ్లీ ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా మరో చివరి అవకాశాన్ని కల్పించారు. తిరిగి ఉద్యోగంలో చేరాలనుకునే అర్హులైన కార్మికులు వైద్య పరీక్షలలో ఫిట్ కావాల్సి ఉంటుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.