సముద్రానికి ఆవల... ఎక్కడో చిన్న దీవిలో... ఓ పక్క కరోనా.. మరో పక్క ఆకలి కేకలు. కరోనా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న సమయం. దేశాలు సరిహద్దులు మూసేసి నివారణ చర్యలు చేపట్టిన తరుణం. పొట్టకూటి కోసమో... చదువు కోసమో.. దేశం కాని దేశం వచ్చి లాక్డౌన్ వల్ల వందలాది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం కదిలింది.
మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సముద్రసేతు ప్రారంభించింది. నావికాదళం రెండు యుద్ధ నౌకలతో వారందరినీ దేశానికి తరలించేందుకు సన్నద్ధం అయ్యింది. అందులో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వ సాగర జలాలపై ముందుకు కదిలింది.
మాల్దీవుల్లో చిక్కుకున్న వారిలో 698 మందిని కేరళలోని కొచ్చికి చేర్చింది. నౌకలో దేశానికి వస్తున్న మహిళ ఓ వీడియో ద్వారా నావికాదళానికి కృతజ్ఞతలు చెప్పారు. గర్భిణీ అయిన తనను ఎంతో జాగ్రత్తగా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో దేశానికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్డౌన్ ఉల్లంఘన కేసులు!