ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభమయ్యాయి. రెడ్‌క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు రవి శ్రీనివాస్.. ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు. చిరంజీవి అభిమానులు 50 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. కరోనా బాధితులు తమను సంప్రదిస్తే ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తామని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని చిరంజీవి ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే నేడు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ సేవలు ప్రారంభమయ్యాయి.