ETV Bharat / state

Government Hospitals: వైద్యం కోసం రోజుల తరబడి నిరీక్షణ - ప్రభుత్వ దవాఖానా

అన్ని రంగాల్లో సాంకేతికత పెరిగినా ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీ చీటీలు ఇవ్వడంలో పాత పద్ధతినే పాటిస్తున్నాయి. చాంతాడంత క్యూల్లో ఓపీ చీటీ తీసుకొని, వైద్యుడికి చూపించుకొని, టెస్టులు చేయించుకొనేందుకు గంటల సమయం పడుతోంది.

Government Hospitals
ప్రభుత్వ ఆసుపత్రులు
author img

By

Published : Oct 12, 2021, 9:54 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు రోగులు గంటలు, ఒకోసారి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అప్పటికే నీరసంగా ఉండడం ఓపీల వద్ద చాంతాడంత క్యూలను చూసి కొందరు డీలా పడిపోతున్నారు. జిల్లాల నుంచి వచ్చే రోగుల ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించాలని కోరుతున్నారు.

● ఆసుపత్రి: గాంధీ ● ఓపీ చీటీ ఇచ్చే సమయం: ఉ.8.30 నుంచి మధ్యాహ్నం 11 వరకు ● సరాసరిన రోజుకు వచ్చే రోగులు: 1600

● ఆసుపత్రి: ఇ.ఎన్‌.టీ, కోఠి ● ఓపీ చీటీ ఇచ్చే సమయం: ఉ.8.30 నుంచి మ.11 వరకు ● సరాసరిన రోజుకు వచ్చే రోగులు: 1200

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన 51 ఏళ్ల వ్యక్తి నిమ్స్‌ ఆర్థోపెడిక్‌ విభాగంలో వైద్యం కోసం ఉదయం 9 గంటలకే ఆసుపత్రికి వచ్చారు. ఓపీ చీటీ తీసుకొని వైద్యుణ్ని కలిశారు. ఆయన సూచనతో పరీక్షల అనంతరం రుసుము చెల్లించేందుకు వరసలో నిల్చుంటే మధ్యాహ్నం ఒంటి గంటకు తనవంతు వచ్చింది. పరీక్ష ఫలితం కోసం వెళ్తే కౌంటర్‌ మూసేశారు. ఇంటికెళ్లలేక రాత్రికి తెలిసిన వాళ్లింట్లో తలదాచుకున్న ఆయన మరుసటిరోజు రిపోర్టుతో వైద్యుణ్ని కలిసేందుకు వెళ్తే మళ్లీ ఓపీ తీసుకోవాలన్నారు. తీరా ఓపీ రాయించుకుని వెళ్తే ఆ వైద్యుడు అందుబాటులో లేరు. ఆయన ఉన్నరోజే రావాలని వెనక్కి పంపారు.

ఒక విభాగం ఒక దగ్గరుంటే, సంబంధిత వైద్య పరీక్షలు మరో భవనంలో చేస్తున్నారు. ఒక్కో రోగి సమస్య తీవ్రత దృష్ట్యా రెండు విభాగాల వైద్యుల్ని కలవాల్సి ఉంటుంది. ఒకవైద్యుడు ఒక రోజు అందుబాటులో ఉంటే, మరొకరు మరో రోజు ఉంటారు. ఇలాంటి వారు మూణ్నాలుగు రోజులు తిరగాల్సి వస్తోంది.

ఇదీ చూడండి: తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?

Complicated Surgeries: క్లిష్టమైన చికిత్సలు.. ఘనత చాటుతున్న ప్రభుత్వ ఆస్పత్రులు

Corona: కార్పొరేట్ ఆసుపత్రులపై సర్కార్ కొరడా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.