లాక్డౌన్ వల్ల భక్తులకు ఆలయాల్లోకి అనుమతి లేనందున రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా పూజలు చేసుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, బాసర, సికింద్రాబాద్ గణేశ్ ఆలయం సహా రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో ఇప్పటికే ఆన్లైన్ ద్వారా పూజల సదుపాయం కొనసాగుతోంది.
తాజాగా మరో ఏడు ఆలయాల్లోనూ ఈ సౌకర్యాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, తాడ్బండ్ ఆంజయనేయ స్వామి ఆలయం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయం, చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయం, జమాలపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ఆన్లైన్ సేవలు పొందవచ్చని తెలిపింది. భక్తుల పేరిట పూజలు చేసి వారి చరవాణికి సందేశం అందిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.
ఇదీ చూడండి: వలసకూలీల తరలింపునకు నేటినుంచి ప్రత్యేక రైళ్లు