ETV Bharat / state

లాక్‌డౌన్‌ తర్వాత ఊపందుకున్న రవాణా సేవలు - తెలంగాణ ఆర్టీఏ

వాహ‌న‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌నే ల‌క్ష్యంతో ర‌వాణాశాఖ‌లో లాక్‌డౌన్ తర్వాత అనేక సంస్కర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌ చేసేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది.

online services Started in telangana rta after lockdown
లాక్‌డౌన్‌ తర్వాత ఊపందుకున్న రవాణా సేవలు
author img

By

Published : Jul 1, 2020, 8:47 AM IST

లాక్‌డౌన్‌ తర్వాత ఊపందుకున్న రవాణా సేవలు

లాక్‌డౌన్ నుంచి రవాణాశాఖకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో తిరిగి సేవలు ప్రారంభించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ విధానానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. కరోనా దృష్ట్యా అటు ఉద్యోగులకు... ఇటు కార్యాలయానికి వచ్చే వారికి.. శానిటైజర్లు అందిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులేని వారికి సేవలు అందించడం లేదు.

మరోవారం పొడగింపు

జూన్ 1 నుంచి 28 వరకు ద్విచక్రవాహనాల నుంచి 41.87 కోట్లు, కార్ల నుంచి 90.62 కోట్లు, ఇతర వాహనాల నుంచి 3.20 కోట్లు... ఇలా మొత్తం రూ. 135.69 కోట్ల పన్నురవాణా శాఖకు సమకూరింది. మరోపక్క మోటారు వాహనాల పన్ను చెల్లించడానికి గ్రేస్ పీరియడ్‌ను వారం రోజులపాటు పొడిగించడానికి రవాణాశాఖ అంగీకారం తెలిపింది. జూన్‌ 30వ తేదీతో త్రైమాసిక పన్ను గడువు ముగియడం వల్ల... మరో వారంరోజులు పెంచుతూ రవాణాశాఖ అవకాశం కల్పించింది. జులై 7వ తేదీ వరకు ఈ త్రైమాసిక పన్ను చెల్లించవచ్చని రవాణాశాఖ అధికారులు తెలిపారు.

రవాణాశాఖలో మొక్కల పెంపకం

ఆరో విడత హరితహారంలో భాగంగా రవాణాశాఖలో మొక్కల పెంపకం చేపట్టారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉన్న స్థలంలోనే వీలైనన్ని ఎక్కువ మెుక్కలను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పుడు అరటి వనాన్ని పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

వాహనదారులకు సేవలు అందించడంలో రవాణాశాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : అప్పన్న స్వామి ఆఖరి గంధం అరగదీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.