రైలు చక్రాల నుంచి చెలరేగిన మంటలు నివారించేందుకు తిరుపతి కోచింగ్ డిపోలోని సిబ్బంది.. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ రైలు చక్రాలు, ఇరుసులో ఉష్ణోగ్రతలు పెరిగితే వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీన్ని ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడిపే రైళ్లలో ఉపయోగించనున్నట్లు పేర్కొంది. బ్రేకులు వేసినప్పుడు, ఇతర సందర్భాల్లో రైలు బోగీల కింద ఉండే ఇరుసు, చక్రాల్లో బేరింగ్ జామ్ అవ్వడం, స్ప్రింగ్ విరగడం వంటి కారణాలతో ఉష్ణోగ్రతలు పెరిగి మంటలు వస్తుంటాయి.
కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఒక చిప్‌ను అమరుస్తారు. పరిమితికి మించి ఉష్ణోగ్రతను గుర్తించినప్పుడు వెంటనే ఇది మొబైల్‌ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి లోకో సిబ్బంది, స్టేషన్ మాస్టర్లను అప్రమత్తం చేస్తుందని ద.మ రైల్వే తెలిపింది. ఈ మొబైల్ అప్లికేషన్ ధర రూ.2 వేలని పేర్కొంది. మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన సిబ్బందిని ద.మ.రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.
ఇదీ చదవండి: తాగి పడేసిన బోండాలతో సేంద్రియ ఎరువు.. ఎక్కడో తెలుసా..?